Honor | మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన మాజీ చైర్మన్ దంపతులు

Honor | మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన మాజీ చైర్మన్ దంపతులు

Honor | పరకాల,ఆంధ్రప్రభ: పరకాల మున్సిపల్ నూతన చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ను మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ దంపతులు ఘనంగా సన్మానించారు. మంగళవారం రోజు పరకాల మున్సిపల్ నూతన చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు, పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ సన్మానించి శుభాకాంక్షలు తెలియ చేశారు.

పరకాల పట్టణ, విలీన గ్రామాల ప్రజల ఆశీస్సులతో నూతనంగా ఎన్నుకోబడిన పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ హనుమకొండ లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవగా చైర్మన్ సునీల్ కుమార్ ను సాధారణంగా ఆహ్వానించి శాలువతో సన్మానించి, ఆశీర్వదించి శుభాకాంక్షలను పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ దంపతులు సోదా అనిత రామకృష్ణ తెలియజేశారు. Bఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply