Honor | సర్పంచ్ ఆవుల సునీతకు సన్మానం

Honor | చిట్యాల, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మండల సర్పంచ్ ల ఫోరం ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని సుంకెనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాదమిక పాఠశాలలో ఉపాధ్యాయులు శాంత కుమారి, కల్పన, రాధికలు సర్పంచ్ ఆవుల సునీత యాదయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి చిన్నారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలకు అంగన్వాడి కేంద్రానికి మౌలిక వసతుల కలపనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు భాగ్యమ్మ, రజిత, తదితరులు పాల్గొన్నారు.
