Honor | అసుపత్రులలోని డైట్ టెండర్లను రద్దు చేయాలి…

Honor | అసుపత్రులలోని డైట్ టెండర్లను రద్దు చేయాలి…
- జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రేకు సన్మానం
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా ని ప్రభుత్వ 7పీహెచ్‌సీలలో ఇటీవల నిర్వహించిన రోగులకు భోజనం అందించే డైట్ టెండర్లను రద్దు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కొమురం భీం ఆసి ఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు ఆసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్, ఆదివాసి సంఘాల ఐకాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనక యాదవ్ రావు, ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ కొమురం భీం అసిఫాబాద్ జిల్లా చైర్మన్ ఆడ వెంకటేష్, ప్రజా సంఘాల నాయకులతో వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కు సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో జిల్లాలోని కోన్ని ప్రభుత్వ ఆసుపత్రులో ఇటీవల వేసిన డైట్ టెండర్ ను రద్దు చేయాలని, టెండర్లలో జరిగిన విషయాలపై విచారణ జరపాలని జిల్లాలో కోన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఆసిపాబాదు మెడికల్ కాలేజీకి సంబంధించిన డైట్ టెండర్ వేసే ముందు ఎలాంటి ప్రకటనలు చేయకుండా ఆసుపత్రుల్లో నోటీసు బోర్డులో పెట్టకుండా టెండర్లు నియమాలు సరిగా పాటించకుండా ఆసుపత్రి సూపర్డెంట్ లకు తెలియకుండా టెండర్ల ప్రక్రియ కొనసాగించారని వినతి పత్రంలో తెలిపినట్లు వారు పేర్కొన్నారు.

ఈ టెండర్ ప్రక్రియలో మొత్తం 18 దరఖాస్తులు రాగా ఝాన్సీ పేరిటా 7 దరఖాస్తులు, జలీల్ పేరిట 5 దరఖాస్తులు, సంతోష్ పేరిట 2 దరఖాస్తులు, మాధవ్ పేరిటా, 2 దరఖాస్తులు సునీత ఒకటి దరఖాస్తులు చేశారని ఇందులో నాన్ లోకల్ అయినా ఖానాపూర్‌కు చెందిన లాల్ అనే వ్యక్తి ఝాన్సీ, జలీల్, సంతోష్ పేరిట ఆరు డైట్ టెండర్లను దక్కించుకోవడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న కుమ్రం భీం జిల్లాకు ఇద్దరికి మాత్రమే రావడం జరిగినదని స్థానికుడు కాకపోయిన లాలు అనే వ్యక్తి బినామీ వ్యక్తుల పేరిట 6 టెండర్లను దక్కించుకున్నాడన్నారు. దీనివలన కుమ్రం భీం జిల్లావాసులకు తీరని అన్యాయం జరిగిందనీ కలెక్టర్ కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ టెండర్ లను వెంటనే రద్దు చేస్తూ.. స్థానికంగా ఉన్నవారికి అవకాశం కల్పించాలని కోరారు.
