Honor | పాఠశాల అభివృద్ధికి కృషి

Honor | పాఠశాల అభివృద్ధికి కృషి

  • ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్

Honor | కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ జీపీ పరిధిలోని మొర్రిగూడెం ఎంపీపీఎస్ పాఠశాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని ఖానాపూర్ ఏఏంసీ చైర్మన్ పి. భూషణ్ అన్నారు. ఈ రోజు మొర్రిగూడెం పాఠశాలలో ఉపాధ్యాయులు సాయి కృష్ణ , సుద్దాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషన్ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన పెద్ద బెల్లాల్ గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి ఉప సర్పంచ్ తక్కల రమ్య రవీందర్ పంచాయతీ కార్యదర్శి పి రాజశేఖర్ జి పి.వార్డు సభ్యులకు శాలువలు కప్పి ఘనంగా సన్మానం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలకు ప్రహరీ, గేటు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని, అలాగే పలు సమస్యలపై ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల సమస్యలన్నీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ భూషణ్, సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ టి.రమ్య, రవీందర్, వార్డు సభ్యులు కలిసి పాఠశాల విద్యార్థుల కోసం 15వేల రూపాయల విలువ గల స్కానర్ జిరాక్స్ మిషన్‌ను అందజేశారు.

Leave a Reply