Home Guard | యువతిని వేధించిన హోంగార్డుపై బదిలీ వేటు

Home Guard | యువతిని వేధించిన హోంగార్డుపై బదిలీ వేటు

  • సీరియస్ గా స్పందించిన ఏ ఎస్పీ శుభం
  • హోంగార్డును సరెండర్ చేసిన ఏ ఎస్పీ
  • నర్మెట్టకు హోంగార్డు బదిలీ
  • సెటిల్మెంట్స్ లో హోంగార్డు దిట్ట

Home Guard | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : వరంగల్ ఏఎస్పీ వెహికిల్ డ్రైవర్(Vehicle driver) గా పనిచేస్తూ యువతిని వేధిస్తున్న హోంగార్డు సత్యంపై క్రమశిక్షణ వేటువేశారు. యువతిని టార్చర్ పెడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఏఎస్పీ శుభం సీరియస్ గా స్పందించారు. ఆరోపణలు వచ్చిన హోంగార్డును ఇవాళ‌ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు సరెండర్ చేశారు. అంతే ఆఘమేఘాల మీద హోంగార్డు సల్లూరి సత్యమును నర్మెట్ట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

పాస్ ఫోర్ట్ ను కూడా ఇచ్చి పంపించారు. ఐపీఎస్ ఆఫీసర్, వరంగల్ ఏఎస్పీ శుభం వద్ద హోంగార్డు సత్యం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. డ్రైవర్ గా పనిచేస్తున్న హోంగార్డు బయట మాత్రం డ్యూటీలో సూట్ దరిస్తూ గన్ మెన్ నంటూ ప్రచారం చేసుకొంటూ అనేక సెటిల్మెంట్ల‌(Settlements)లో తలదూరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ లోగా ములుగు రోడ్డులో ఓ ప్రవేట్ దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతిని వేధిస్తున్నట్లు సదరు యువతి షీ టీం ఠాణా(She Team Thana)కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో యువతిని వేధిస్తున్న ఘటన వెలుగు చూసింది. పోలీసు అధికారికి ప్రభుత్వం కేటాయించిన వాహనం ఇటీవల మరమ్మతులకు గురికావడంతో హోంగార్డు సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లారు.

అక్కడ పనిచేస్తున్న యువతిని పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నెంబ‌ర్ తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యువతితో అసభ్యకరంగా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. తాను పోలీసు అధికారి వద్ద గన్ మెన్(Gunmen)గా పనిచేస్తున్నానని చెప్పి, తాను ఏది, ఎంత చెబితే అంతా చెలామణి అవుతుందని సదరు యువతికి చెబుతూ టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. సదరు యువతి వద్దకు తరుచూ వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తుండడంతో బాధితురాలు పోలీసు శాఖలో తెలిసిన వారికి విషయం చెప్పి షీటీంకు సమాచారమిచ్చారు.

షీ టీం ఇన్ స్పెక్టర్ సదరు హోంగార్డును పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం బయటకు పొక్కడంతో హోంగార్డు(Home Guard) ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. హోంగార్డు బాగోతం బయటపడటంతో వరంగల్ ఏఎస్పీ శుభం తక్షణమే తన వద్ద విధులు నిర్వర్తించవద్దంటూ సరెండర్ చేశారు. హోంగార్డు వ్యవహారాలు పర్యవేక్షించే ఆర్ఐ సదరు హోంగార్డు సత్యంను నర్మెట్టకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Leave a Reply