మహిళలకు 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం…

మహిళలకు 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం…
మష్రూమ్స్, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ విధానం పై ప్రారంభమైన శిక్షణ
మార్చి 2 నుంచి మార్చి 6వ తేదీ తేదీ వరకు ఐదు రోజులు పాటు శిక్షణా కార్యక్రమం
మష్రూమ్స్ పెంపకం, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల తయారీ లో 45 మంది ఎస్.హెచ్.జి మహిళలకు శిక్షణ
శిక్షణ తరగతులను ప్రారంభించిన అసోసియేట్ ఫ్రోపెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డాక్టర్ సి.కత్తిరేషన్
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎంపీ కేశినేని శివనాథ్ సారధ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో మష్రూమ్స్ పెంపకం, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల తయారీ విధానం పై ఐదు రోజుల పాటు శిక్షణ పొందేందుకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి వెళ్లిన 45 మంది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలకు శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభం అయ్యాయి. 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కు వెళ్లిన వీరికి మార్చి 2 నుంచి మార్చి 6వ తేదీ వరకు ఐదు రోజులు పాటు మష్రూమ్స్ పెంపకం, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల తయారీ విధానం పై శిక్షణ వుంటుంది.
ఈమేరకు ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఐదు రోజుల నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశం ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో సోమవారం అసోసియేట్ ఫ్రోపెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డాక్టర్ సి.కత్తిరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రోఫెసర్ డాక్టర్ ఎస్.రమేష్ శక్తివేల్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహ్మాద్ ఖాన్, హోమ్ బేస్డ్ ప్రొగ్రామ్స్ ట్రైనర్ మానస, మష్రూమ్స్ పెంపకం ట్రైనర్ ప్రసన్న శిక్షణ తీసుకునే మహిళలకు ఉత్పత్తుల తయారీ విధానం, శిక్షణ తరగతుల కార్యక్రమాల గురించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గురించి వివరించారు.

హోమ్ బెస్డ్ ప్రొడక్ట్స్ (వాషింగ్ ఫౌడర్, లిక్విడ్ సోప్స్, షాంపులు, పినాయల్) తయారీ లో శిక్షణ పొందే వారికి ట్రైనర్ మానస హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీకు కావాల్సిన ముడి పదార్థాలు వాటి లక్షణాలు, తయారీ ప్రక్రియ, ఉపయోగాలు సవివరంగా తెలియజేయటం జరిగింది. అలాగే మష్రూమ్స్ పెంపకం ట్రైనర్ ప్రసన్నమష్రూమ్స్ పెంపకానికి సంబంధించి అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు.
స్వయం ప్రతిపాదికన వృద్ది సాధించేందుకు శిక్షణ కార్యక్రమంకు పంపించినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు కేశినేని ఫౌండేషన్, ఎన్.ఐ.ఆర్.డికి శిక్షణ పొందుతున్న మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మతో పాటు తదితరులు పాల్గొన్నారు.
