Holidays | ఈ సారి 9 రోజులు..

Holidays | ఈ సారి 9 రోజులు..

  • సంక్రాంతి సెలవుల షెడ్యూల్ విడుద‌ల‌
  • జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు…
  • తిరిగి 19వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభం

Holidays | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని స‌ర్కార్ బ‌డుల‌కు రాష్ర్ట ప్రభుత్వం సంక్రాంతి సెలవుల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు శనివారం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించారు. తొమ్మిది రోజులపాటు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ఉండనున్నాయి.

తిరిగి జనవరి 19వ తేదీన పాఠశాలలో పునః ప్రారంభం కానున్నాయి. గతంలో పది రోజులు ఇస్తే సెలవులు ఈసారి ఒకరోజు తగ్గించి ఇవ్వటం విశేషం. అన్ని యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు డిప్యూటీ డిఈవోలు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.

వందరోజుల ప్రణాళికలో భాగంగా 10వ తరగతి పరీక్షల కు సంబంధించి ఇచ్చిన నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాలలో అమలు చేయాలని సూచించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి పాస్ అయ్యేందుకు ప్రత్యేక ముందస్తు ప్రణాళికలను రూపొందించారు. ప్రతి సబ్జెక్టును కూలంకషంగా విద్యార్థులతో చదివించి రాయించాలని సూచించారు. నూరు శాతం విద్యార్థులు పాస్ కావటానికి వందరోజుల ప్రణాళిక కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

Leave a Reply