బెజ్జంకిలో ఘనంగా హోలీ సంబరాలు..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : రంగుల పండుగ హోలీని బెజ్జంకి మండలంలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో యువకులు, పెద్దలు కలిసి ఒకరిపై రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు.. స్నేహితులు, బంధువులు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దలు, యువకులు పర్యావరణ హిత రంగులను ఉపయోగిస్తూ పండుగను జరుపుకోవడం విశేషం. ఆనందభరిత వాతావరణంలో, సామరస్యానికి ప్రతీకగా ఘనంగా నిర్వహించబడింది.

Leave a Reply