ముంజులూరులో ఘోరం

ముంజులూరులో ఘోరం

రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని..

 తొక్కేసిన గుర్తుతెలియని వాహనాలు

ఆంధ్రప్రభ, బంటుమిల్లి ( కృష్ణాజిల్లా ) :

కత్తిపూడి ..ఒంగోలు   216 జాతీయ రహదారి పై కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరు టోల్ ప్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు  ప్రమాదంలో  ఓ వ్యక్తి దుర్మరణం చెండాడు.  మచిలీపట్నం మండలం  గిలకలదిండి గ్రామానికి చెందిన మోకా శివ శంకర్ (40) ముంజలూరు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో శరీరం తునాతునకులై తల ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అయితే సేకరించిన వివరాలు ప్రకారం గిలకలదిండికి చెందిన మోకా శివశంకర్ కృత్తివెన్ను మండలం పోడు గ్రామం తన అత్తగారిది కావడంతో ఆమె భార్యను దింపి తిరిగి వస్తుండగా ఇది జరిగినట్లుగా చెబుతున్నారు. టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి వాహనం ఆగిపోవడంతో తో నడుచుకుంటూ వెళుతూ రోడ్డుపైన పడిపోయాడు. దీంతో అటుగా వెళుతున్న వాహనాలు చాలామంది తెల్లవారుజామున ఆయన పక్కకి లాగినట్లు చెబుతున్నారు. కానీ ఏమి జరిగిందేమో తెల్లవారిసరికి శివ శంకర్ మృతదేహం ముక్కలు ముక్కలుగా తల ఒక్కటే మాత్రమే కనిపిస్తూ చిందరవందర గా ఉంది. అయితే పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాగా తెల్లవారుజామున టిప్పర్ వాహనం ఢీ కొట్టి శివశంకర్ మృతదేహం చిందర వందర అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాద ఘటన తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు

Leave a Reply