ముస్లిం, మైనార్టీల పక్షపాతి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి……

ముస్లిం, మైనార్టీల పక్షపాతి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి……

ముస్లిం మైనార్టీల కు ఉప ముఖ్య మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్‌దే…

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్….

విజయవాడ కృష్ణలంక, ఆంధ్ర ప్రభ : రంజాన్ పండుగ సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో ముస్లిం ఈద్గాహ్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ మాస ఉపవాస దీక్షల ముగింపు ఈద్-ఉల్-ఫితర్ పండుగలో దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు, ముస్లిం సోదరులతో కలిసి అల్లాహ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముస్లిం సోదర దరీమణులందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లిం కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలిచారని అన్నారు. రాష్ట్ర చరిత్ర లో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని తెలిపారు. కుటుంబ సభ్యుల్లాంటి ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్‌ను కోరుకుంటున్నట్లు చెప్పారు. ముస్లిం సోదరులు గత ఐదేళ్లలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాం లో పండుగ అంటే పండుగలా ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధికి నిరంతరం పని చేసిన జగన్ మోహన్ రెడ్డి కి అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు నాహీద్, రిజ్వాన్, అలీమ్, వలి, మునీర్, జావీద్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply