చల్లపల్లిలో హిందూ ముస్లిం భాయీ భాయీ…

( ఆంధ్రప్రభ, చల్లపల్లి ) : కృష్ణా చల్లపల్లి హిందువులకు ముస్లీం పెద్దలు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. వినాయక చవితి సందర్భంగా చల్లపల్లిలో హిందూ ముస్లిం భాయీ భాయీ అంటూ హిందువులు, ముస్లీంలు పరస్పర ఐక్యతను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డీఎస్పీ టి. విద్యశ్రీ, చల్లపల్లి సీఐ కె. ఈశ్వర రావు, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మట్టి వినాయక విగ్రహాల వాడకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, అలాగే ప్రతి పండుగను మత సామరస్యంతో జరుపుకోవడం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని సూచించారు.

Leave a Reply