అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటు

అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటు

ఇప్పటికే ఆదాయం తగ్గి అప్పుల పాలవుతున్నాం
మున్సిపాలిటీ నిర్ణయాలతో వ్యాపారం దెబ్బతింటుంది
వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలి
గోడును తెలిపిన వ్యాపార వాణిజ్య కేంద్రాల నిర్వాహకులు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాల నిర్వా హకులు మున్సిపాలిటీ అధికారులు విధిస్తున్న అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డివిజన్ కేంద్రంలో వారు బుధవారం విలేకరులతో మాట్లాడి తమ గోడును వెల్లగక్కారు. మున్సి పాలిటీ అధికారులు ఎలాంటి స్పష్టత లేకుండా అనూహ్యంగా భారీగా 8రేట్లను పెంచి వసూలు చేస్తున్నారని వ్యాపారులు మండిపడ్డారు. గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ఈ పన్నులు తక్కు వగా ఉండేవి. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోకి మారిన తర్వాత ఒక్కసారిగా భారీగా పెంచడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పులు చేసి వ్యాపారాలు నడిపే పరిస్థితి:

పల్లె ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా గ్రామాల్లోనే వివాహాలు నిర్వహించు కోవడంతో పట్టణ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడింది..దీంతో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అప్పులు చేసి వ్యాపారాలు నడిపే పరిస్థితి ఏర్పడిందని వ్యాపార నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ముఖ్యం గా ఫంక్షన్ హాళ్లు, చిన్న వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఎలాంటి సానుభూతి లేకుండా అధిక పన్నులు విధించడం వ్యాపారు లపై మరింత భారాన్ని మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికా రులు తక్షణమే స్పందించి 8రేట్లను పునఃసమీక్షించి తగ్గించాలి. లేకపో తే ఉద్యమాలకు దిగాల్సి వస్తుందని వ్యాపారులు హెచ్చరించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపార వాణి జ్య కేంద్రాల నిర్వాహకులు చిలువేరు సత్యనారాయణ, కుసుమ రమే ష్, మామిడాల మధు, పడకంటి కృష్ణమూర్తి, కుంభం ఉపేందర్ తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply