అవసరమే ఆసరా.. అధిక ధరలకు యూరియా అమ్మకం

అవసరమే ఆసరా.. అధిక ధరలకు యూరియా అమ్మకం

బస్తాకు 30 రూపాయలు అధికంగా వసూలు
రైతుల జేబులకు చిల్లులు వేస్తున్న ఫర్టిలైజర్ దుకాణం దారులు
ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలేవి ?
కొత్తూరు గ్రామంలోని ఆదర్శ ఫర్టిలైజర్స్ షాపులో అధిక ధరలకు యూరియా

రాయపర్తి, ఆంధ్రప్రభః సరిపడా యూరియా లేక, సకాలంలో సంచులు రాక మండల రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాకు కృత్రిమ కొరతను సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారులు మామూళ్లకు ఆశ పడి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొత్తూరు ఆదర్శ ఫర్టిలైజర్ షాపులో అధిక ధరకు యూరియాను విక్రయిస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారు అని స్థానికులు అంటున్నారు.

రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన 266 రూపాయలకు ఇవ్వాల్సిన బస్తా ఓ రైతు ఐదు బస్తాలకు 1500 రూపాయలు ఇవ్వాలని దుకాణం యజమాని రైతుకు తెలిపాడు. ఆ రైతు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇవ్వమని కోరగా 300 రూపాయలకు మాత్రమే యూరియా బస్తా ఇస్తానని కరాకండిగా చెప్పాడు. దీంతో పంట కోసం చేసేదిలేక అధిక ధరకు యూరియా కొనుగోలు చేసిన్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పాడు.

ఇలా ఒక రైతు ఐదు బస్తాల యూరియాకు అదనంగా 170 రూపాయలు దుకాణం దారుడు వసూలు చేయగా వందల బస్తాలు అమ్మే దుకాణపు యజమానికి ప్రతి రైతు 30 రూపాయల చొప్పున యూరియా బస్తాకు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని పలువురు రైతులు దుకాణం దారులను ప్రశ్నించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులు, స్పందించి అధిక ధరలకు యూరియా విక్రయించే వారిపై చర్యలు తీసుకోని రైతులు కోరుతున్నారు.

Leave a Reply