High Court | కన్న ఊరు అభివృద్ధికి కృషి చేస్తా

High Court | కన్న ఊరు అభివృద్ధికి కృషి చేస్తా

  • ఆట సేవలు అభినందనీయం
  • హైకోర్టు జడ్జి శ్రీదేవి

High Court | ధర్మపురి, ఆంధ్రప్రభ : తన పుట్టిన ఊరు తిమ్మాపూర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హైకోర్టు జడ్జి జస్టిస్ జువ్వాడి శ్రీ దేవి(High Court Judge Justice Juvwadi Sri Devi) అన్నారు. ఈ రోజు ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ata) సహకారంతో నిర్మాణమైన ప్రహరీ గోడ, వాటర్ ఆర్ఓ ప్లాంట్లను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ బుక్స్(Bags Books) తదితర సామాగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు సేవ చేసే కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ గ్రామానికి రావడంతో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని చిన్ననాడు ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసినట్లు గుర్తు చేశారు. ఆట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తాను సైతం గ్రామ అభివృద్ధి(Development) కోసం కృషి చేస్తానని తెలిపారు.

చాలా మంది నగరం లో జీవించడం ఇష్టపడుతున్న ఈ రోజుల్లో తన తండ్రి జువ్వాడి సూర్య రావు ఇదే గ్రామంలో మరణించే వరకు ఉన్నారని గ్రామ అభివృద్ధి కోసం తపించారని తెలిపారు. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్ ఆట అధ్యక్షుడు జయంతిచర్ల ఆట ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, నిర్మల్ జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు కుచాడి శ్రీహరి రావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, తిమ్మాపూర్ సర్పంచ్ నల్మాసు పుష్పలత వైకుంఠం, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, తహసిల్దార్ ఎరుకొండ శ్రీనివాస్, మండల విద్యాధికారి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply