Breaking | గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్

హైదరాబాద్ : ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ మేరకు నేడు టీజీపీఎస్ సీ కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మెయిన్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్లు పరిశీలించవచ్చని కోరింది. అయితే ఏ ఒక్క అభ్యర్థికి తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నియామక పత్రాలు ఇవ్వరాదని పేర్కొంది. ఇదిలా ఉంటే గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో, దానిని విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *