హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఈ కేసును జస్టిస్ కె. లక్ష్మణ్ కొట్టివేశారు.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి రూ. 2500 కోట్లు పంపించారంటూ కేటీఆర్ ఆరోపించారు.
మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన ఆధీనంలో ఉంచుకొన్నారని ఆరోపించారు. ఆయనకు ముడుపులు చెల్లిస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. అలా వసూల్ చేసిన నగదు రూ 2500 కోట్లు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు పంపారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు
హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. దీంతో కేటీఆర్‌పై 504, 505(2) కేసులు నమోదు చేశారు. దీనిపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఈ కేసును కొట్టి వేసింది.