NOT HIDMA : హిడ్మా కాదు.. దేవా
- విప్లవ దంపతులకు పూవర్తి వీడ్కోలు
- మావోయిస్టుల కంచుకోట కన్నీటి ధార
ఆంధ్రప్రభ, చింతూరు, (ఏఎస్‌ఆర్ జిల్లా) : ఏపీతో పాటు చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలకు కొరకరాని కొయ్యిగా మారిని మోస్ట్ వాం-టె-డ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా శఖం గురువారంతో ముగిసింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లో మాడ్వి హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టిన విషయం విధితమే.

. ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం హిడ్మా, ఆయన భార్య రాజే మృతదేహాలను బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బంధువులకు అప్పగించారు. బందోబస్త్ నడుమ పూవర్తి గ్రామానికి తరలించారు. ముందుగా అక్కడ సీఆర్పీఎఫ్ Crpf Camp) క్యాంపులో ఉంచారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.

ఈ ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పూవర్తిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఆ గ్రామంలో 50 ఇళ్లకు పైగానే తాళాలు వేశారు. హిడ్మా తల్లి లేవడానికి ఓపిక లేక కన్నీరు మున్నీరుగా విలపించింది. పూవర్తి గ్రామం మొత్తం బంధువుల రోదనలతో మిన్నంటింది. ఈ గ్రామంలో 50 పైగా ( 50 Houses) ఇళ్ళు ఉన్న పూవర్తి గ్రామంలో 80 మందిపైగా (80 BOYS) యువకులను మావోయిస్టులుగా (Joined Maiost party) హిడ్మా మార్చి వేశాడు.

గురువారం సాయంత్రం కన్నీటి వీడ్కోలుతో హిడ్మా, రాజే ల అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలుతో హిడ్మా శకం (HIDMA HYSTERY END) పూర్తి అయిందని చెప్పవచ్చు. మావోయిస్ట్ నేత హిడ్మా తలపై ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్రు ప్రకటించిన మొత్తం రివార్డు రూ.1.80 కోట్లు- ఉంది.
NOT HIDMAమావోయిస్టుల కంచుకోట కన్నీటి ధార
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా పేరోందిన పూవరి (PUVARTI) ప్రస్తుతం మూగబోయింది. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఆయన స్వగ్రామంలో (SAD..SILENT) నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. ఈ పూవర్తి గ్రామం మావోయిస్టు పార్టీ రాజధానిగా పేరు గావించింది. ఆ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరు పార్టీలో చేరి పని చేశారు. పూవర్తిలో 8 వీధులుండగా హిడ్మా ఇల్లు బండిపారలో ఉంది.
NOT HIDMAదేవా అంటే.. హిడ్మానే


హిడ్మా అసలు పేరు దేవా (DEVA) అని, హిడ్మా HIDMA) ఆయన తండ్రి పేరని (FatherName) గ్రామస్థులు తెలిపారు. ఆయన తండ్రి హిడ్మా చిన్నతనంలో మృతి చెందాడని తెలిపారు. హిడ్మాకు అక్క బుద్రి, అన్న మూయా, చెల్లెల్లు కోసి, దేవే, ఉంగి ఉన్నారని గ్రామస్తులు పేర్కోన్నారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో అన్న చనిపోయాడని వెల్లడించారు.
హిడ్మాను ఆ గ్రామంలో సీఆర్పీఎఫ్ క్యాంప్ పెట్టక ముందు ఐదేళ్ల కిందిట చూశామని కొంతమంది గ్రామస్తులు తెలిపారు. ఒక్కసారి భార్యతో వచ్చినప్పుడు చూశామని మరికొందరు తెలిపారు. గ్రామస్థులకు తన వంతుగా సాయం కూడాNO చేసేవాడని, ఆపద అంటే ఆదుకునేవాడని అన్నారు.

