Hidma | హిడ్మాను చంపలేదు..

Hidma | హిడ్మాను చంపలేదు..
- ఎదురుకాల్పులు జరిగాయి
- పూర్తి సమాచారంతో,, ఏకకాలంలో దాడులు చేశాం
- ఇప్పటికి 50 మందిని అరెస్టు చేశాం
- ఏపీ అడిషనల్ డీజీ మహేశ్ లడ్డా
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఏపీ ఏజెన్సీలో నక్సల్, పోలీసులు కు మధ్య ఈ రోజు కూడా కాల్పులు జరిగాయిఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉందని, ఇంకా పూర్తి వివరాలు రాలేదని ఏపీ (Andhra pradesh) ఎడిషనల్ డీజీ మహేశ్ లడ్డా తెలిపారు. మంగళవారం ఏపీలోని నాలుగు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న 50 మంది పీజీఎల్ఏ సభ్యులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీసు కమిషనకేట్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చత్తీస్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారునిఘా వర్గాలు మావోయిస్టుల కదలికలు పై ప్రత్యేక దృష్టి పెట్టారునవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం, నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారు, వాళ్ల నుంచి సేకరించిన సమాచారం తో ఎక్కడెక్కడ మావోయిస్టులు లు ఉన్నారని దృష్టి పెట్టాం అని లడ్డా వివరించారు.
ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులులను (Maoistulu) పట్టుకున్నాం, ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం అని లడ్డా తెలిపారు. రాష్ట్ర చరిత్ర లో ఇంతమంది కీలక వ్యక్తును పట్టుకోవడం ఇదే ప్రధమమని, కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను పట్టుకున్నాం అన్నారు. 45 ఆయుధాలు, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు. ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు, ఇందులో పాల్గొన్న సిబ్బందికి లడ్డా అభినందనలు తెలిపారు. మా ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందిమాకు ముందే సమాచారం వచ్చింది. వెంటనే పై నిఘా పెట్టాం, వారి ఆలోచనలు, కార్యకలాపాలు ను గమనించాం, అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నాం అని లడ్డా అన్నారు.
తెలంగాణలో (Telangana) కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారువాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు . అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి మూవె మెంట్, ప్లాన్ల పై ఇతర సమాచారం లేదు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారం లో నిజం లేదు అని లడ్డా వివరించారు.
