Hero Sri Vishnu | టీజర్ రివ్యూ..

Hero Sri Vishnu | టీజర్ రివ్యూ..
Hero Sri Vishnu | శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ రిలీజ్
జాతకాలు – వాస్తుతో కొత్త తరహా లవ్ స్టోరీ
యూత్‌ఫుల్ హ్యూమర్‌తో ఆకట్టుకున్న ప్రపోజల్ సీన్లు
శ్రీ విష్ణు టైమింగ్‌కు నవ్వుల జల్లు
28న థియేటర్లలోకి.. విజయాన్ని అందిస్తుందా?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శ్రీవిష్ణు నటించిన హిలేరియస్ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం. ఈ సినిమాతో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పుడు హైలీ ఎంటర్టైనింగ్ టీజర్ లాంచ్ చేశారు. ఇంతకీ.. ఈ టీజర్ ఎలా ఉంది..? ఈ మూవీ శ్రీవిష్ణుకి విజయాన్ని అందించేనా…?
Hero Sri Vishnu | కొత్త తరహా లవ్ స్టోరీ..

ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంతకీ.. టీజర్ ఎలా ఉందంటే.. విష్ణు పాత్రకు జాతకాలంటే పిచ్చి, అతని తండ్రి మాత్రం డబ్బునే దేవుడిలా భావిస్తాడు. చిన్న నిర్ణయం తీసుకునే ముందు కూడా వాస్తు చూసే అతని అలవాటు కథలో హాస్యాన్ని తీసుకొస్తుంది. ఈ గందరగోళ మధ్యలో అతను ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయి అతనికంటే అనూహ్యంగా ప్రవర్తిస్తుంది. ఒక క్షణం ప్రేమగా ఉంటే, మరో క్షణం తనకో అబ్బాయిని వెతకమని అడుగుతుంది. ఈ డైనమిక్‌తో ఒక కొత్త తరహా లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది.
Hero Sri Vishnu | ఫ్రెస్ ఎంటర్ టైనర్..

ప్రపోజల్, కిస్ సీన్లు యూత్‌ఫుల్ హ్యూమర్‌తో ఆకట్టుకుంటాయి. కథనాన్ని వినూత్నంగా, అత్యంత ఫన్నీగా ప్రెజెంటర్ చేశారు దర్శకుడు యదునాథ్ మారుతి రావు చిత్ర దర్శకులు. కామెడీలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించారు శ్రీ విష్ణు. ఆయన టైమింగ్, రియాక్షన్స్ ప్రేక్షకులకు నవ్వులు పంచాయి. నయన సారిక పాత్ర కామెడీని మరింత పెంచుతుంది. వారి కెమిస్ట్రీ సరదా అల్లరి, యూనిక్ డైలాగ్స్ తో మెప్పిస్తుంది. శ్రీ విష్ణు విష్ణు విన్యాసం ఒక ఫ్రెష్ ఎంటర్టైనర్గా అలరించనుందనే నమ్మకాన్ని ఈ టీజర్ కలిగించింది. మరి.. విష్ణు ఆశించిన విజయాన్ని విష్ణు విన్యాసం ఇస్తుందేమో చూడాలి.

