Hero Nikhil | కార్తికేయ 3 నిజంగా ఉంటుందా…?

Hero Nikhil | కార్తికేయ 3 నిజంగా ఉంటుందా…?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హీరో నిఖిల్ కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి కార్తికేయ. ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన కార్తికేయ 2 అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం విశేషం. దీంతో కార్తికేయ 3 పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇంత వరకు కార్తికేయ 3 గురించి అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే.. ఇప్పుడు కార్తికేయ 3 గురించి వార్తలు వస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇంతకీ.. కార్తికేయ 3 నిజంగా ఉంటుందా..? ఉంటే.. పట్టాలెక్కేది ఎప్పుడు…?

Hero Nikhil

నిఖిల్ హీరోగా చందు మొండేటి కార్తికేయ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. మిస్టరీ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ముఖ్యంగా దేవాలయాలు, ఆధ్యాత్మిక నేపథ్యం, సస్పెన్స్ అంశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సీక్వెల్ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్టుగానే మూవీ రిజల్ట్ కూడా వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కార్తికేయ 2 రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కార్తికేయ 3 కూడా ఉంటుందని ప్రకటించడంతో మరింత క్రేజ్ ఏర్పడింది.

Hero Nikhil

నిఖిల్ స్వయంభు సినిమా బిజీలో ఉన్నాడు. ఈ సినిమా ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉంది. మరో వైపు చందూ మొండేటి యానిమేషన్ మూవీ బిజీలో ఉన్నాడు. మరి.. కార్తికేయ 3 ఉంటే.. ఎప్పుడు ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఆమధ్య కార్తికేయ 3 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా నిఖిల్ చెప్పారు. దర్శకుడు చందూ మొండేటి ప్రస్తుతం స్క్రిప్ట్‌ ను పూర్తి చేసే పనిలో ఉన్నారని, అంతలోపు తాను ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేస్తానని చెప్పారు. అయితే కార్తికేయ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దాని పై మాత్రం ఇంత వరకు క్లారిటీ లేదు.

Hero Nikhil

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. చందూ మొండేటి కార్తికేయ 3కు సంబంధించిన స్టోరీ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ కూడా ఆ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. అయితే.. చందూ మొండేటి ఈసారి మరింత భారీగా.. మరింత కొత్తగా చూపించాలి అనుకుంటున్నాడట. దీనికి బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందట. దీని గురించి చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అన్ని లెక్కలు తేలిన తర్వాత కార్తికేయ 3 గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఏది ఏమైనా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

CLICK HERE TO READ Suhas | హే భగవాన్‌ మెప్పించేనా…?

CLICK HERE TO READ MORE

Leave a Reply