- సర్కార్ ఉత్తర్వులు జారీ
ప్రతీయేటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అధికారికంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సర్కార్ జీవో 282ను జారీ చేసింది. సీఎం కార్యాలయం చేసిన విజ్ఞప్తి మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు వెలువరించింది. ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి అందజేత కర్తవ్యంగా ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వేకు వీలుగా కులగణన చేసింది. ఎస్సీ కులాల ఉప వర్గీకరణకు పచ్చజెండా ఊపింది. ఈ మహత్తర నిర్ణయాన్ని గుర్తుంచుకునే లక్ష్యంతో సామాజిక న్యాయ దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది.