మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన మట్ట రామస్వామి గౌడ్ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీమండల అధ్యక్షులు కానుగల జోగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు లింగముది రాజ్,మాజీ ఉప సర్పంచ్, నిరంజన్,వార్డు సభ్యులు శేఖర్, రాజు,నాయకులు నాగయ్య, వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.
