Help | నిరుపేద యువకుడి వివాహానికి సహాయం..

Help | నిరుపేద యువకుడి వివాహానికి సహాయం..

నిరుపేద యువకుని వివాహానికి సాయం అందిస్తున్న గ్రామ పటేల్, పెద్దలు సర్పంచ్

Help | జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన ఎర్మ రవి తల్లిదండ్రులు కోల్పోయిన నిరుపేద వివాహం సోమవారం సిర్పూర్ (యు) మండలంలోని మహగం ఆశ్రమంలో జరిగినసామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకుంటుండగా ఖర్చుల నిమిత్తం గ్రామ పెద్దలు గ్రామస్తులు విరాళాలు సేకరించి 14 వేల రూపాయలు సహాయం అందించినట్లు దుబ్బగూడ గ్రామ పటేల్ పెందూర్ దేవు రావు, దుబ్బగూడ సర్పంచ్ మడవి కౌసల్య భీమ్రావు తెలిపారు. వివాహం చేసుకుంటున్న రవికి తల్లిదండ్రులు లేరని నిరుపేద కావడంతో గ్రామ పెద్దల నిర్ణయంతో విరాళాలు సేకరించి ఖర్చుల నిమిత్తం అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనసూయ, పెద్దలు జ్యోతిరావ్ దేవారి పుష్నక భీమ్రావు, వార్డు సభ్యులు భుజంగరావు, మడవి రాజేశ్వర్, మెస్రం సోమేశ్వర్, కనుక రాంబాయి, గ్రామస్తులు పాల్గొన్నట్లు వారు తెలిపారు.

Leave a Reply