Help | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి గ్రామంలోని బంటుపల్లి కోటేశ్వరరావు ఇళ్ళు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలిపోయింది. సర్వం కోల్పోయిన కోటేశ్వరరావు కుటుంబాన్ని పెడన జనసేన నాయకులు లింగం నాగేశ్వరరావు పరామర్శించారు. ఆ కుటుంబానికి LVR ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు లింగం నాగేశ్వరరావు రూ.10,000 నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల ఆర్ఐ శివశంకర్, పెందూరు గ్రామ వీఆర్వో సుదర్శన్, సుగుణం జన, పట్టపు నాగబాబు, అల్లం సత్యనారాయణ, పత్తి రాముడు, లింగం ఫణి భోగిరెడ్డి బాబి తదితరులు పాల్గొన్నారు.


