Helmet | సేఫ్ రైడింగ్ పై అవగాహన

Helmet | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని ట్రాఫిక్ నగరంలోని వాహనదారులకు సేఫ్ రైడింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నగరంలో బెంజ్ సర్కిల్ పరిసర ప్రాంతాలలో వాహనదారుల్లో భద్రతా చైతన్యం(Security awareness) పెంపొందించేందుకు అధికారులు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ ప్రయాణిస్తున్న వాహనదారులను ప్రత్యేకంగా గుర్తించి వారిని అభినందించారు. ఈ క్రమంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రయాణిస్తున్న(traveling) ద్విచక్ర వాహనదారులకు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణించు సమయంలో వెనుక వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించడం, సీటు బెల్ట్ ధరించి క్రమబద్ధంగా డ్రైవ్ చేస్తున్న కారు డ్రైవర్లు ఇలాంటి బాధ్యతగల వాహనదారులకు థాంక్యూ ఫర్ సేఫ్ రైటింగ్ ట్రాఫిక్ పోలీస్ విజయవాడ అనే ట్యాగ్‌తో కూడిన బెలూన్లు అందజేశారు.

Helmet

ఈ చర్య ప్రజల్లో సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంచడమే కాకుండా, ఇతరులకు కూడా మంచి ప్రేరణగా మారింది. ఈ సందర్భంలో డీసీపీ ట్రాఫిక్ షేక్ షరీన్ బేగం ఐపీఎస్(Shareen Begum IPS) మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం ఒక అలవాటు కాదు… ఒక రక్షణ కవచం, సీటు బెల్ట్ మీ ప్రాణాలను కాపాడే అతి చిన్న కానీ అతి శక్తివంతమైన పరికరం అలాగే ప్రజలందరూ తమతో పాటు ప్రయాణించే కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Helmet

Leave a Reply