హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. మూడు రోజులుగా భారీగా వర్షం పడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎండ కాచింది. ఒక్కసారిగా మేఘావృతమై వర్షం (Rains) ప్రారంభమైంది. చిన్న చినుకులుగా ప్రారంభమై భారీ వర్షం కురుస్తోంది.
జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, సరూర్‌నగర్, మధురానగర్, యూసఫ్‌గూడ, మాధాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతుంది. దీంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ కూడా జామ్ అయింది.

