వారం రోజుల గ్యాప్ తర్వాత..
ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి (Rain) వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ, పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు.

వచ్చే మూడు రోజులు…
తెలంగాణ (Telangana) లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) ప్రకటించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు (Brought rains) కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాలలో (districts) ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవన ద్రోణి ఈరోజు అమృత్ సర్, డెహ్రాడూన్ షాజహాన్పూర్, వాల్మీకినగర్, చేపరా, జల్పాయిగురి అటు పిమ్మట తూర్పు ఈశాన్య దిశలో అరుణాచల్ ప్రదేశ్ వరకు కొనసాగుతోంది. ఉపరితల చక్రవాహత ఆవర్తనం ఒకటి నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు (Tamil Nadu) తీరం వద్ద సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 5.8 కిమీ మధ్యలో కొనసాగుతోంది. ఉత్తర దక్షిణ ద్రోణి ఒకటి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా తూర్పు మధ్య అరేబియన్ సముద్రం దక్షిణ ప్రాంతం నుండి దక్షిణ అంతర్గత కర్నాటక, తమిళనాడు, పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మధ్య బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 5.8 కి మీ మధ్యలో కొనసాగుతోంది.

వాతావరణ హెచ్చరిక….
సోమవారం (Monday) రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సోమవారం, మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలితో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.

Leave a Reply