Heavy fine | ట్రంప్‌కు భారీ జరిమానా.. లండన్ కోర్టు సంచ‌ల‌న తీర్పు

  • 2017లో ట్రంప్‌కు వ్యతిరేకంగా సంచలన పత్రం విడుదల
  • రష్యాతో బంధం ఉందన్న యూకే మాజీ గూఢచారి
  • లండన్ హైకోర్టులో దావా వేసిన డొనాల్డ్​ ట్రంప్
  • ఆరోపణలు నిరూపించలేకపోయార‌ని ట్రంప్‌కు జరిమానా విధించిన కోర్టు


న్యూఢిల్లీ​, ఆంధ్రప్రభ : యూకేకు చెందిన ఓ మాజీ గూఢచారిపై దావా వేసేందుకు యత్నించిన కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లండన్ హైకోర్టు జరిమానా విధించింది. ఆరోపణలు నిరూపించడంలో విఫలమైనందుకు గాను న్యాయ ఖర్చుల కింద ట్రంప్ 7,41,000 డాలర్లు (భార‌త కరెన్సీలో దాదాపు ₹6 కోట్లు) చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పును వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళితే.. యూకే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎంఐ6 మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ ట్రంప్​పై 2017లో ఒక సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ డాక్యుమెంట్​లో ట్రంప్​పై తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా ఏజెంట్లతో ట్రంప్ రాజీపడ్డారని తెలిపారు. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు రష్యా ఆయనకు ఐదేళ్ల పాటు సహాయం చేసిందని ఆరోపించారు.

గూఢచారిపై దావా విషయంలో..
2013లో ట్రంప్ మాస్కో పర్యటనకు సంబంధించి యూకే మాజీ గుఢచారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2017లో ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్​గా తొలిసారి ప్రమాణం చేసేముందు ఆ డాక్యుమెంట్​ను ప్రచురించారు. దీంతో, క్రిస్టోఫర్​పై లండన్ కోర్టులో ట్రంప్ దావా వేశారు. అయితే.. ఆ ఆరోపణలను రుజువు చేయడంలో ట్రంప్ విఫలం కావడంతో కోర్టు ఆయనకు తాజాగా జరిమానా విధించింది. న్యాయ ఖర్చుల కింద 7,41,000 డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *