HEAVY | ట్రాఫిక్ జామ్

HEAVY | ట్రాఫిక్ జామ్
- 20కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
HEAVY | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారం నుంచి పస్రా వరకు.. అలాగే మేడారం నుండి గోవిందాపేట వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మార్గంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్సులు, ప్రైవేట్ వాహనాలతో రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. కోట్లాది భక్తుల ఇలావేల్పు అయినా సమ్మక్క సారాలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జనారణ్యం అయ్యింది లక్షలాది భక్తులతో మేడారం పరిసరాల ప్రాంతం కిక్కిరిసిపోయింది.


