హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో విషాదం చోటుచేసుకుంది. ఒక కేసులో వాదిస్తున్న న్యాయవాది గుండెపోటుకు గురయ్యాడు. కోర్టు హాలులోనే ఆయన కుప్పకూలి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. హైకోర్టులో న్యాయవాదిగా ఉన్న వేణుగోపాలరావు ఇవాళ ఒక కేసుపై వాదనలు వినిపిస్తుండగానే గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలాడు. అక్కడున్న వారు స్పందించి ఆయన వద్దకు చేరుకునే సరికే కన్నుమూశారు. దీంతో న్యాయమూర్తి సహా అక్కడున్న వారందరూ షాక్ కు గురయ్యారు. న్యాయవాది మృతికి సంతాప సూచకంగా నేడు కోర్టులోనే అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.
