Heart attack | సత్యం చిత్రపటానికి పూలమాలలు…

Heart attack | సత్యం చిత్రపటానికి పూలమాలలు…
Heart attack | వైరా, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందిన వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇజ్జగాని సత్యం (నిప్పు) కుటుంబాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెజండ్ల సాయి కుమార్ లు ఈ రోజు పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఇజ్జగాని సత్యం (నిప్పు), చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. యూత్ కాంగ్రెస్(Youth Congress) తరుపున వారి కుటుంబానికి రూ.50వేల(Rs. 50 thousand) రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బోదేపూడి రాజా, పల్లపు కొండలు, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోటకూర గోపి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ జాన్ పాషా (గన్ను), బెల్లంకొండ సాయి తేజ, అయిలూరి తేజ రెడ్డి, ఏదునూరి శ్రీను(బుజ్జి), చీమల రాకేష్, తేజవత్ స్వామి, దినేష్, వంశీ, శేషి, పల్లపు గోపి, లక్కీ, స్టాలిన్, మున్నా, సతీష్, తదితరులు పాల్గొన్నారు….
