heart attack | ఇంటెలిజెన్స్‌ ఏఎస్ఐ మృతి

heart attack | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్‌ విభాగం ఏఎస్ఐగా పనిచేస్తున్న నారాయణ(55) రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. న్యాల్‌‌కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన నారాయణ జహీరాబాద్‌లో స్థిరపడ్డారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ఏఎస్ఐ హఠాన్మరణం పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply