Heart Attack | ఏఆర్ కానిస్టేబుల్ మృతి

Heart Attack | ఏఆర్ కానిస్టేబుల్ మృతి
Heart Attack | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి… ఏఆర్ కానిస్టేబుల్ కన్నయ్య కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎప్పటిలాగే తన విధులు ముగించుకుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.
కన్నయ్య నిద్రిస్తుండగా గుండెపోటు రావడంతో చనిపోయారు. ఉదయం తన తోటి సిబ్బంది గమనించేలోపు ఆయన అప్పటికే విగతజీవిగా పడిఉన్నారు. ఆయన మృతిపై తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండే కన్నయ్య అకాల మరణం చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి.
