Health Report | మార్క్ శంక‌ర్ క్షేమం – ఆందోళ‌న వ‌ద్దు …చిరంజీవి

పవన్ కు చంద్రబాబు ఫోన్… మార్క్ ఆరోగ్యం పై ఆరా
శంకర్ త్వరగా కోలుకోవాలంటూ జగన్ ట్విట్
ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నారా లోకేష్
పవన్ ధైర్యంగా ఉండాలంటూ కెటిఆర్ ట్విట్

హైద‌రాబాద్ – సోద‌రుడు పవన్ కళ్యాణ్ కుమారుడు చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉన్నాడ‌ని మెగాస్టార్ చిరంజీవి వెల్ల‌డించారు… సింగ‌పూర్ ఆసుప‌త్రిలో శంక‌ర్ కు చికిత్స అందిస్తున్నార‌ని తెలిపారు.. బాబు కాళ్లకు స్వల్పంగా గాయాలు అయ్యాయని వెల్ల‌డించారు.. బాబు చ‌దువుతున్న స్కూల్లో నేటి ఉద‌యం 9.30 కి అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని, ఈ ఘ‌ట‌న‌లో బాబుతో పాటు మ‌రో 15 మంది విద్యార్దులు స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన‌ట్లు చిరంజీవి చెప్పారు.. అంద‌ర్ని వెంట‌నే అగ్నిప్ర‌మాద ర‌క్ష‌క సిబ్బంది హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించార‌ని వెల్ల‌డించారు.. ప్ర‌స్తుతం అంద‌రు విద్యార్ధులు కోలుకున్నార‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని అన్నారు. అర‌కు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న త‌న సోద‌రుడు ప‌వ‌న్ కుటుంబంతో స‌హా నేటి మ‌ధ్యాహ్నం సింగ‌పూర్ కు వెళుతున్నార‌ని చెప్పారు..

ప‌వ‌న్ కు చంద్ర‌బాబు ఫోన్

సీఎం చంద్రబాబు మార్క్ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగపూర్ వైద్యులతో పవన్ కల్యాణ్‌‌, చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్‌ వైద్యులు తెలిపారు. కాగా ప‌వ‌న్ కు చంద్ర‌బాబు ధైర్యం చెప్పారు.. వెంట‌నే సింగ‌పూర్ వెళ్లాల్సిందిగా సూచించారు.. సీఎం చంద్రబాబు మార్క్ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగపూర్ వైద్యులతో పవన్ కల్యాణ్‌‌, చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్‌ వైద్యులు తెలిపారు.

మార్క్ శంక‌ర్ త్వ‌రగా కోలుకోవాలి – జ‌గ‌న్

https://twitter.com/ysjagan/status/1909498336748638612

అగ్నిప్ర‌మాదంలో ప‌వ‌న్ త‌న‌యుడు మార్క్ శంక‌ర్ గాయ‌ప‌డ‌టం ప‌ట్ల ఎపి మాజీ ముఖ్య‌మంత్రి, వైసిపి అధినేత జ‌గ‌న్ దిగ్ర్బాంతి వ్య‌క్తం చేశారు. ఈ మేరకు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.. ఈ అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయినట్లు వివరించారు. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు జగన్ .

బాబు వేగంగా కోలుకోవాలి.. నారా లోకేష్..

https://twitter.com/naralokesh/status/1909470179366466032

పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యానని అన్నారు మంత్రి నారా లోకేష్. ఈ ప్రమాదంలో గాయ‌ప‌డిన వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాన‌ని ట్విట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి ప్రార్థనలు మరింత బలాన్ని ఇస్తాయని తెలిపారు.

కెటిఆర్ దిగ్ర్రాంతి …

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న కుమారుడు అగ్నిప్ర‌మాదంలో చిక్కుకోవ‌డం ప‌ట్ల బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఆ చిన్నారి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున‌ట్లు ట్విట్ చేశారు.

https://twitter.com/KTRBRS/status/1909473714200051754

ప్ర‌మాదం ఎలా జ‌రిగింది.

సింగపూర్‌లో రివర్‌ వ్యాలీ ప్రాంతంలో మంగళవారం ఉదయం దాదాపు తొమ్మిదిన్నర గంటలకు ఘటన జరిగింది. అయితే ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా రెండు, మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే సింగపూర్‌ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారికి రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఆర‌గంట‌లోనే అక్క‌డి మంట‌ల‌ను ఆర్పివేశారు. గాయ‌ప‌డిన వారంద‌రికి మెరుగైన వైద్య చికిత్స అందించామ‌ని, అంద‌రూ క్షేమంగా ఉన్నార‌ని అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *