Health Care | దేశంలోని అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ డేకేర్ సెంటర్లు – ప్రకటించిన ప్రధాని మోడీ
తర్పూర్: మధ్య ప్రదేశ్ : దేశంలోని అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ డేకేర్ సెంటర్లు తెరవాలని కేంద్ర నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని చతర్పూర్లో బాగేశ్వర్ థామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్ట్ ఇన్స్టి్ట్యూట్కు ప్రధాని ఆదివారంనాడు శంకస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేన్సర్‌తో పోరాడేందుకు ఈ ఏడాది బడ్జెట్లో పలు ప్రకటనలు చేశామని గుర్తుచేశారు. కేన్సర్ మందులు చవకగా దొరికేలా చూసేందుకు, మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లాల్లోనే కేన్సర్ డేకేర్ సెంటర్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

దేశంలోని మత, సాంస్కృతిక సంప్రదాయాలను విమర్శిస్తున్న వారిపై ప్రధాని నిశిత విమర్శలు గుప్పించారు. కొందరు నేతలు మతాన్ని పరిహసిస్తూ, ప్రజలను విడగొడుతూ, తరచు దేశాన్ని, విశ్వాసాలను బలహీనపరిచే విదేశీ శక్తులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. శతాబ్దాలుగా హిందూయిజాన్ని వ్యతిరేకించే వారు మన నమ్మకాలు, ఆలయాలు, సంస్కృతి, సంప్రదాయాలపై దాడులు చేస్తూనే ఉన్నారని అన్నారు. ప్రగతిశీలక మతాన్ని, ఐక్యతను దెబ్బతీయడమే వారి లక్ష్యంగా ఉందన్నారు. ఈ క్రమంలో దేశంలో ఐక్యతా మంత్రాన్ని జాగృతం చేసేందుకు ధీరేంద్ర శాస్త్రి విశేష కృషి చేశారని, ఆయన చొరవతో ఇప్పుడు కేన్సర్ ఇన్‌స్టి్ట్యూట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు.
ఒక వార్డుకు ప్రధాని తల్లి పేరు
భాగేశ్వర్ థామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ఒక వార్డుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ పేరు పెట్టనున్నట్టు ధీరేంద్ర శాస్త్రి ప్రకటించారు. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రెండు, మూడేళ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. నిస్సహాయులు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కేన్సర్ పేషెంట్లకు ఉచితంగా ఇక్కడ వైద్య సేవలను అందిస్తామని తెలిపారు.