సింగపూర్ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకరికి సింగపూర్ లోని కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు హస్పటల్లోనే చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు.. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని , ఎటువంటి ప్రాణాపాయం లేదని ప్రకటించారు..

కాగా మంగళవారం అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో బాలుడి కాళ్లు, చేతులకు గాయాలు కావడం ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవి, వదిన సురేఖతో కలసి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరుకున్నారు. నేటి తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న వెంంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుడిని చూశారు పవన్ కల్యాణ్.. ఆరోగ్యం గురించి భార్యను వివరాలు అడిగి తెలుకున్నారు.. అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడారు.
మార్క్ కోలుకుంటున్నాడని.. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు పవన్ కు తెలిపారు. తొలుత శంకర్ కు అత్యవసర వార్డులో చికిత్స అందించిన వైద్యులు.. బుధవారం ఉదయం గదికి మార్చారు. మరో మూడు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత శంకర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు..