Karimabad | ప్రతిభకు హెడ్మాస్టర్ ప్రశంసలు

Karimabad | ప్రతిభకు హెడ్మాస్టర్ ప్రశంసలు

చెకుముకి పోటీల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ప్రభుత్వ విద్యార్థులు


Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : మండల స్థాయి చెకుముకి పోటీలో ప్రతిభ కనబరిచిన శివనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను హెడ్మాస్టర్ (headmaster) అభినందించారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ వరంగల్ జిల్లా, జనవిజ్ఞాన వేదిక వారి సౌజన్యంతో నిర్వహించిన ఖిలా వరంగల్ మండల స్థాయి సైన్స్ చెకుముకి పోటీahay ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివనగర్ కు చెందిన కే.ప్రకాష్, ఎస్.గణేష్ లు విద్యార్థులు మండల స్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు.

ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్ర స్వామి (Narendra Swamy), ఉపాధ్యాయ బృందg విద్యార్థులను అభినందించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… సైన్స్ అనేది మన నిజజీవితంలో భాగమని సైన్స్ ద్వారా మనం ఎన్నో ప్రయోగాలు చేసి మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల లాభాలు పొందవచ్చు అని తెలిపారు. విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ ఏర్పరచుకొని రాణించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply