headache | తలనొప్పి కారణాలు – నివారణ మార్గాలు

headache తలనొప్పి కారణాలు – నివారణ మార్గాలు.

headache ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తలనొప్పి…రావడానికి అనేక కారణాలు, నివారణకు అనేకమార్గాలు.
అలాగని తలనొప్పి అంత తేలికగా తీసుకోదగినదేం కాదు. ప్రధానంగా రెండు రకాల కారణాలు ఉండొచ్చు. మొదటిది సాధారణ తలనొప్పి.
ఇది మెదడులోని నిర్మాణ పరమైన సమస్యల వల్ల కాకుండా, మెదడులోని రసాయనాలు, నరాలు లేదా రక్తనాళాల సమస్యల వల్ల రావొచ్చు. ఈ తలనొప్పి తరచుగా రావొచ్చు, సాధారణంగా ఎక్కువ మందికి వస్తుంది ఈ తలనొప్పి.
తీవ్రమైనది, శాశ్వత చికిత్స తీసుకోవలసినది మైగ్రేన్(Migrane)
ఇది తీవ్రమైనది, తలలో నరాలన్నీ కొట్టుకున్నట్లుగా ఉంటుంది. ఈ నొప్పి తరచుగా తలకు ఒక వైపు మాత్రమే వస్తూంటుంది. దీనితో పాటు వికారం, వాంతులు కూడా వస్తుంటాయి.
టెన్షన్, ఆందోళనలతో వచ్చే తలనొప్పి వల్ల తల చుట్టూ, నుదురుపై లేదా మెడపై ఒక బ్యాండ్ గట్టిగా బిగించినట్లు ఉండే తేలికపాటి నుండి మధ్యస్థంగా నొప్పి ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు నిద్ర లేమి వల్ల కావచ్చు. లేదా కూర్చున్న, నిలుచున్న భంగిమ వల్ల రావచ్చు.

headache | క్లస్టర్ తలనొప్పి

ఇది చాలా అరుదైనది. కానీ.. అత్యంత బాధాకరమైనది. కళ్ళ చుట్టూ తీవ్రంగా దేనితోనో గుచ్చుతున్నట్లుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. కళ్లు ఎర్రబడటం, నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్య లేదా నిర్మాణపరమైన సమస్యల కారణంగా వచ్చే తలనొప్పికి మన జీవనశైలే (Lifestyle) కారణం.
వృత్తిపరమైన పని ఒత్తిడి కావొచ్చు, వ్యక్తిగతమైన సమస్యల వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళన భావోద్వేగాల వల్ల కలిగే ఒత్తిడి వీటిద్వారా వచ్చే తలనొప్పి.
నిద్రలేకపోవడం వల్ల, లేదా నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేవడం, తప్పనిసరై మేల్కొనవలసి రావడం వల్ల కలిగే తలనొప్పి.
తగినంత నీరు తాగకపోవడం వల్ల కలిగే డీహైడ్రేషన్ తో వచ్చే తలనొప్పి.
ఆహారం/పానీయాలు-ఆల్కహాల్, కెఫిన్ అధికంగా తీసుకోవడం లేదా అకస్మాత్తుగా ఆపేయడం.
కొన్ని రకాల ప్రాసెస్ చేసిన ఆహారాలు మోనోసోడియం గ్లుటమేట్ లాంటి
కంటి చూపు సమస్యలలతో వచ్చే తలనొప్పి. ఇది ఎందువల్లనంటే, ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం లేదా చీకట్లో మొబైల్ లేదా టీవీ చూడడం వల్ల కళ్లపై ఒత్తిడి పడడం వల్ల వచ్చే తలనొప్పి.

headache

ఈ కారణాల వల్లనే కాక కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్‌ కూడా తలనొప్పిని కలిగిస్తాయి. మహిళల్లో నెలసరి సమయంలో లేదా హార్మోన్ల (hormones) చికిత్స సమయంలో..హార్మోన్ల మార్పుల వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశాలుంటాయి.

అకస్మాత్తుగా వచ్చే, తీవ్రమైన తలనొప్పి, లేదా జ్వరం, మెడ పట్టేయడం, గందరగోళం వంటి లక్షణాలతో కూడిన తలనొప్పి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి మెదడులో రక్తస్రావం లేదా మెనింజైటిస్ వంటి తీవ్రమైన సమస్యలకు సంకేతాలు కావచ్చు.

headache |తలనొప్పి నివారణ మార్గాలు ఏమిటి

తలనొప్పి రకాన్ని బట్టి చికిత్స మారుతుంది. అయితే.. సాధారణంగా పాటించాల్సిన నివారణ, ఉపశమన మార్గాలు కొన్ని ఉంటాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం…
మొదటగా మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
క్రమబద్ధమైన నిద్రసమయపాలన పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం ద్వారా కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
మానసిక ఒత్తిడి ని అదుపులో ఉంచుకోవాలి. దీనికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు లేదా ఇష్టమైన అభిరుచులలోలో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
రోజంతా తగినంత నీరు-అంటే, కనీసం 2-3 లీటర్లు ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
కెఫిన్, ఆల్కహాల్ పరిమితం చేసుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం లేదా అకస్మాత్తుగా ఆపడం తలనొప్పికి దారి తీయవచ్చు.
సమయానికి తినడం, కొన్ని ఆహారాలకు సున్నితత్వం ఉంటే వాటిని గుర్తించి మానుకోవడం.

ఒకవేళ ఇలాంటి అలవాట్లేమీ లేకున్నా తలనొప్పి బాధిస్తూంటే, సాధారణ ఉపశమన మార్గాల గురించి ఆలోచించాలి. నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్న గదిలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం. తల లేదా మెడ వెనుక భాగంలో చల్లని లేదా వేడి ప్యాక్‌ను ఉంచడం వల్ల రక్తనాళాల పై ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది టెన్షన్ తలనొప్పికి వేడి, మైగ్రేన్‌కు చల్లని ప్యాక్ సాధారణంగా సహాయపడుతుంది.
మెడ, భుజాలు, కణతల పై మెల్లగా మసాజ్ చేయడం వల్ల టెన్షన్ తలనొప్పి తగ్గుతుంది.
సాధారణ తలనొప్పికి పారాసెటమాల్(Paracetomol) లేదా (Ibuprofen) ఇబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందులు ఉపయోగపడతాయి.
మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పికి డాక్టర్ సలహా మేరకు ట్రిప్టాన్స్ వంటి ప్రత్యేక మందులు తీసుకోవలసి ఉంటుంది.
మీరు తరచుగా లేదా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లయితే, డాక్టర్‌ను సంప్రదించడం. సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా అవసరం.
ఇవి ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్య లేదా నిర్మాణపరమైన సమస్యల కారణంగా వస్తుంది.

మానసిక ఒత్తిడి ని అదుపులో ఉంచుకోవాలి. దీనికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు లేదా ఇష్టమైన అభిరుచులలోలో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.

రోజంతా తగినంత నీరు-అంటే, కనీసం 2-3 లీటర్లు ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
కెఫిన్, ఆల్కహాల్ పరిమితం చేసుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం లేదా అకస్మాత్తుగా ఆపడం తలనొప్పికి దారి తీయవచ్చు.
సమయానికి తినడం, కొన్ని ఆహారాలకు సున్నితత్వం ఉంటే వాటిని గుర్తించి మానుకోవడం.
ఒకవేళ ఇలాంటి అలవాట్లేమీ లేకున్నా తలనొప్పి బాధిస్తూంటే, సాధారణ ఉపశమన మార్గాల గురించి ఆలోచించాలి. నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్న గదిలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం. తల లేదా మెడ వెనుక భాగంలో చల్లని లేదా వేడి ప్యాక్‌ను ఉంచడం వల్ల రక్తనాళాల పై ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది టెన్షన్ తలనొప్పికి వేడి, మైగ్రేన్‌కు చల్లని ప్యాక్ సాధారణంగా సహాయపడుతుంది.

మెడ, భుజాలు, కణతల పై మెల్లగా మసాజ్ చేయడం వల్ల టెన్షన్ తలనొప్పి తగ్గుతుంది.
సాధారణ తలనొప్పికి పారాసెటమాల్(Paracetomol) లేదా (Ibuprofen) ఇబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందులు ఉపయోగపడతాయి.
మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పికి డాక్టర్ సలహా మేరకు ట్రిప్టాన్స్ వంటి ప్రత్యేక మందులు తీసుకోవలసి ఉంటుంది.
(ఈ వ్యాసం పాఠకుల ప్రాధమిక అవగాహన కొరకు మాత్రమే అందించబడుతోంది. సమస్య తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించడం, వారి సలహా, సూచనల మేరకు మాత్రమే మందులు వాడడం సరైనది)

click here to read Scrub typhus | వ్యాధి భయంతో వణుకుతున్న జిల్లా..

click here to read more

Leave a Reply