హైదరాబాద్ : ఒక్క విద్యార్థి (student) మీద పోలీసుల లాఠీ (police baton) పడినా తెలంగాణ (Telangana) సమాజం చూస్తూ ఊరుకోదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. ఇందుకేనా విద్యాశాఖ(Department of Education)ను, హోం శాఖను మీ వద్ద పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ(Osmania Universit)కి వస్తున్న సందర్భంగా విద్యార్థులను ముందస్తు అరెస్టు (Arrest) చేయడం అప్రజాస్వామికమని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎమర్జెన్సీ రోజులు
ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తోందని హరీశ్‌రావు అన్నారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? అని నిలదీశారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన (Democratic Governance) అని చెప్పి, ఎమర్జెన్సీ రోజులను (Emergency Days) రేవంత్ రెడ్డి తిరిగి తెచ్చిండని మండిపడ్డారు. గ్రంథాలయాల్లో (Libraries) పోలీసుల లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. నిరుద్యోగుల (Unemployed) హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరని, ఇనుప కంచెలు, బ్యారికెడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరని అన్నారు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.