Harish shankar | ప్లాన్ ఎప్పటికైనా ఫలించేనా..?

Harish shankar | ప్లాన్ ఎప్పటికైనా ఫలించేనా..?

Harish shankar | ఖుషి సీక్వెల్ పై మళ్లీ చర్చ ఎందుకు..?
నటుడిగా బిజీ అయిన ఎస్.జె. సూర్య
పవన్ కళ్యాణ్ సూచనల తర్వాత మారిన పరిస్థితి
ఖుషి సీక్వెల్ కోసం హరీష్ శంకర్ రాసిన కథ
హీరో హీరోయిన్స్ ఈగో క్లాష్ తో ఆసక్తికరమైన లైన్
నిజంగా ఖుషి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందా..?

Harish shankar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఖుషి.. ఓ సంచలనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ (Director) ఎస్.జె. సూర్య తెరకెక్కించారు. అయితే.. ఖుషి సీక్వెల్ గురించి ఆమధ్య వార్తలు వచ్చాయి. తర్వాత ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. ఇప్పుడు మరోసారి ఖుషి సీక్వెల్ వార్తల్లో నిలిచింది. ఇంతకీ.. ఏమైంది..? నిజంగా ఖుషి సీక్వెల్ సాధ్యమేనా..?

Harish shankar | ఎస్.జె. సూర్య మళ్లీ మెగా ఫోన్..

ఖుషి సినిమా దర్శకుడు ఎస్.జె.సూర్య.. డైరెక్షన్ పక్కనపెట్టి.. యాక్టింగ్ (Acting) పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ విలన్ గా తనదైన్ స్టైల్ లో నటిస్తూ మెప్పిస్తుండడం విశేషం. మహేష్ బాబు స్పైడర్ మూవీలో విలన్ గా నటించిన ఎస్.జె.సూర్య.. ఈమధ్య నాని సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించి తనలోని నటుడ్ని సరికొత్తగా పరిచయం చేశాడు. ఆమధ్య పవన్ కళ్యాణ్ ఓ వేడుకలో.. ఎస్.జె.సూర్య నటుడుగా మెప్పిస్తున్నాడు కానీ.. ఆయన మంచి దర్శకుడు.. అందుచేత దర్శకత్వం పై మళ్లీ ఫోకస్ పెట్టాలని చెప్పారు.

Harish shankar

Harish shankar | ఖుషి సీక్వెల్ లైన్ ఇదే..

దీంతో ఎస్.జె.సూర్య డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ ఖుషి సీక్వెల్ చేస్తారేమో అనే మాటలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హరీష్ శంకర్ ఖుషి సీక్వెల్ గురించి చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ అనుకున్నారు. ఆతర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. దీని గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఖుషి సినిమాకి సీక్వెల్ లైన్ తో కథను రాసుకున్నాను. ఖుషి సినిమాలో (Movie) హీరో హీరోయిన్స్ ఈగో క్లాష్ వచ్చి విడిపోయి మళ్ళీ ఒకే కాలేజ్ లో లెక్చరర్ లు గా చేరితే ఎలా ఉంటుంది..? అక్కడ నుంచి వారిపై స్టోరీ ఎలా ఉంటుంది అనే పాయింట్ తో కథ రాయడానికి సంవత్సరం పాటు వర్క్ చేసానని.. కానీ అది పక్కనపెట్టేసానని హరీష్ శంకర్ చెప్పారు. ఈ స్టోరీ లైన్ వినడానికి బాగానే ఉంది. మరి.. రియాల్టీలోకి వస్తుందా..? అసలు ఎప్పటికైనా ఖుషి సీక్వెల్ వస్తుందా..? అనేది క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే.

Harish shankar

Leave a Reply