ఎంఎస్ చదువుకునేందుకు వెళ్లి…

  • చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, అక్టోబర్ 4 (ఆంధ్రప్రభ) : అమెరికా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీ ఫేస్ టు కు చెందిన పోలే చంద్రశేఖర్ (Pole Chandrasekhar) మృతి చెందాడు. ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీ పేస్-2 కు చెందిన పోలే జగన్మోహన్, పోలే సునితకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు పోలే చంద్రశేఖర్ సుమారు రెండు సంవత్సరాల క్రితం ఎం.ఎస్ చదువుకునేందుకు అమెరికా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ వెళ్ళాడు.

ఎంఎస్ పూర్తయిన తర్వాత గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికా సమయం ప్రకారం శుక్రవారం శుక్రవారం రాత్రి ఇండియా సమయం శనివారం ఉదయం సుమారు 9గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి చంద్రశేఖర్ తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply