సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పద్మారావు కూడా కలిశారు. పద్మారావు నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం దగ్గరకు వెళ్ళామని పద్మారావు మీటింగ్ తరవాత మీడియా ప్రతినిధులు చెప్పారు.
తాము వెళ్లే సరికి సీఎం రూమ్ నిండా జనం ఉన్నారని.. తాము ఆయనతో ఏమీ మాట్లాడలేదన్నారు. తాము తీసుకెళ్లిన పేపర్లను వేం నరేందర్ రెడ్డికి ఇచ్చి వచ్చేసామని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నాడని నేను వెళ్లానని అంతే అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.