TG | సీఎం రేవంత్ పై మండిపడ్డ హరీష్ రావు !
రేవంత్ రెడ్డి తన దిగజారుడుతానాన్ని మరోమారు ప్రదర్శించారు.
పనిచేతగాక.. పనికిమాలిన మాటలు
మా బహిష్కరణ నీ వల్ల కాదు..
నీ నిష్క్రమణకు సమయం దగ్గర పడుతుంది.
కుల సర్వే ఉత్త ఎన్నికల గిమ్మిక్కే. ఫెయిల్యూర్ మ్యాజిక్కే.
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సీటు వచ్చినా.. రేవంత్ కు బుద్ది మాత్రం పెరగలేదని విమర్శలు గుప్పించారు. పనిచేతగాక.. పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నడని ఆగ్రహం వ్యత్తం చేశారు.
‘‘తెలంగాణ సమాజంలో కేసీఆర్‌కు జీవించే హక్కు లేదని రేవంత్ అన్నారు. సమాజంలో జీవించే హక్కు ఎవరికి లేదో ప్రజలను అడుగుదామా? నీ నియోజకవర్గం కొడంగల్… లేక నీ సోంతూరు కొండారెడ్డిపల్లిలో అడుగుదామా ? రేవంత్ రెడ్డి నీకు వచ్చే ధైర్యం ఉందా? అంటూ సవాల్ విసిరారు.
తెలంగాణ సమాజం మొత్తం రేవంత్ రెడ్డికి ఛీ కొడుతోంది. దుమ్మెత్తిపోస్తుంది. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అనే సామెతను అక్షరాల చాటుకుని రేవంత్ రెడ్డి.. తన దిగజారుడుతానాన్ని మరోమారు ప్రదర్శించారు.
సీఎం పదవి లో ఉంటూ చిచోరా భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఛీ కొడుతున్నారు. రాహుల్ గాంధీ మీద నీకున్న కోపాన్ని కేసీఆర్ మీద చూపిస్తే ఎట్లా రేవంత్. ముఖ్యమంత్రిగా ఎవ్వరూ గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి కేసీఆర్ పై ప్రేలాపనలా?
కేసీఆర్ ను తిడితే ఒక్క రోజు హెడ్ లైన్స్ లో ఉంటావేమో కానీ… తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కెసీఆర్ స్థానమే ప్రజల హ్రదయాల్లో పదిలం అని తెలుసుకో. రేవంత్ రెడ్డి ఇదే భాషను కొనసాగించాలనుకుంటే ఆయన జనజీవన స్రవంతిలో ఉండటానికి అర్హుడు కాడు.
తెలంగాణని ఆవిష్కరించిన కెసిఆర్ ను బహిష్కరిస్తావా? సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసు కదా?
మా బహిష్కరణ నీ వల్ల కాదు గాని, నీ నిష్క్రమణకు సమయం దగ్గర పడుతున్నది. సామాజిక బహిష్కరణ చేయాల్సివస్తే ప్రజలను పట్టపగలు మోసం చేస్తున్న నిన్ను చేయాలి రేవంత్.
నాడైనా నేడైనా తెలంగాణ ద్రోహుల భాషే రేవంత్ భాష. అందుకే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా దుర్భాషలాడుతున్నారు. సీఎం లేకి తనాన్ని, చిల్లర మనస్తత్వాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే అర్థం చేసుకుంది. ప్రజాస్వామ్య పంథా లోనే ప్రజలు రేవంత్ కు దిమ్మదిరిగే సమాధానం ఇస్తరు.
కులగణన పేరు మీద కుటిల రాజకీయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నీ సర్వే సరైంది కాదని, నీ పార్టీ నాయకులే తూర్పార పడుతున్నారు. నువ్వు కులగణన చేయలేదు.. గాడిద గుడ్డు చేయలేదని నీ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నడు. సిగ్గులేకుండా నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు.
నువ్వు నిజంగా సత్తా ఉన్న నాయకుడు అయితే ముందు మీ పార్టీలో ఉన్న నాయకులు అందర్నీ ఒప్పించు. కుల సర్వేలో ఖచ్చితమైన గణాంకాలు వచ్చాయని చెప్పించు. నీ కుల సర్వే ఉత్త ఎన్నికల గిమ్మిక్కే. ఫెయిల్యూర్ మ్యాజిక్కే. ఒకవైపు నీ సర్వే కరెక్ట్ అంటావు మరోవైపు రీసర్వే అంటావు. మీ ధమాకు కరాబ్ అయింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటది.
సీఎం పదవి స్థాయిని నీ చిల్లర మాటలతో దిగజార్చకు. ప్రశాంత తెలంగాణలో ఫ్యాక్షన్ వాతావరణాన్ని సృష్టించే నీ ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరిగా మారబోతుంది’’. అని మండిపడ్డారు హరీష్ రావు