Harish Rao | వారికి సీఎం రూ.కోటి ఇప్పిస్తే.. రాజీనామా చేస్తా

Harish Rao | వారికి సీఎం రూ.కోటి ఇప్పిస్తే.. రాజీనామా చేస్తా

Harish Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సిగాచీ బాధితులకు సీఎం రేవంత్ ఒక్కొక్క‌రికి రూ.కోటి ఇప్పిస్తే తాను రాజీనామా చేస్తానని మాజీమంత్రి హరీశ్‌ రావు సీఎం రేవంత్ కు కౌంట‌ర్ వేశారు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… సీఎం రేవంత్‌ మాటలు విని మోసపోవద్దు. మంచినీళ్లు ఇవ్వలేని సీఎంకు ఓటు అడిగే హక్కులేదన్నారు. సిగాచీ కంపెనీలో 54మంది చ‌నిపోతే ఎవరూ ప‌ట్టించుకోలేద‌న్నారు. సిగాచీ పరిశ్రమ ఘటన జరిగిన వెంటనే మేమే ముందు వెళ్లామ‌న్నారు. బాధితులకు సీఎం రూ.కోటి ఇప్పిస్తానని ఇప్పించలేదన్నారు. కోర్టులో కేసు వేసి బాధితుల తరఫున కొట్లాడుతున్నాన‌న్నారు.

Leave a Reply