Harish Rao | డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్న ప్రభుత్వం

Harish Rao | డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్న ప్రభుత్వం

  • మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు

Harish Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం అవినీతి బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లేముందు ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు.

పుప్పాలగూడలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ…. నిన్న ఉదయం రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెడితే.. రాత్రి 9 గంటలకు సిట్ నోటీసులు వచ్చాయని, ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారన్నారు.

అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలాగే చేస్తారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రిజల్ట్స్ చూసి రేవంత్ కు దిమ్మ తిరిగిందని, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా బలపడతామన్న భయం సీఎం రేవంత్ రెడ్డిలో మొదలైందన్నారు.

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని హరీష్ రావు తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి న్యాయవాదుల్ని పెట్టినా.. న్యాయం తనవైపు ఉందని గెలిచామన్నారు. తాము తప్పు చేయలేదు కాబట్టి ఎవ్వరికీ భయపడమన్నారు. మీడియాను, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించినా వదిలిపెట్టబోమన్నారు.

Leave a Reply