BRS | Harish Rao | ఆ పాపం కాంగ్రెస్‌దే!

BRS | Harish Rao | ఆ పాపం కాంగ్రెస్‌దే!

  • న‌ల్ల‌గొండ ఫ్లోరైడ్‌కు…
  • పాల‌మూరు వ‌ల‌స‌ల‌కు కాంగ్రెస్ కార‌ణం
  • అసెంబ్లీల్లో ప్ర‌ద‌ర్శించిన ప‌వ‌ర్ పాయింట్ అన్ని అబ‌ద్దాల్లే
  • బీఆర్ఎస్ శాస‌న‌స‌భ ప‌క్ష ఉప‌నేత‌, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

BRS | Harish Rao | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నల్లగొండ ఫ్లోరైడ్‌కు, పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ అని బీఆర్‌ఎస్ శాస‌న‌స‌భ ప‌క్ష ఉప‌నేత‌, నీటి పారుద‌ల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పీపీటీ ద్వారా చెప్పినవన్నీ అబ్ధాలే అని అన్నారు. ఈ రోజు తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌ద‌ర్శన చేశారు. ‘1956కు ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతం ఉండేది. ఆనాడు ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌తో కలిపిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణను సొంత రాష్ట్రంగా ఉంచాలని ఫజల్‌ అలీ కమిషన్‌ స్పష్టంగా(The Fazal Ali Commission clearly) చెప్పినా తెలంగాణను ఏపీలో కలిపి మరణశాసనం రాసిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ తొలిదశ ఉద్యమ సమయంలో 1969లో సిటీ కాలేజీలో 369 మంది విద్యార్థులను కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్‌.

మలిదశ ఉద్యమ సమయంలో(During the Malidasa movement) ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుని వందలాది మంది యువకులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీ’ అని హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నాడు ఫజల్‌ అలీ కమిషన్‌ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌తో కలుపవద్దని స్పష్టంగా చెప్పింది. ఒకవేళ కలిపితే 174 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంగా అప్పర్‌ కృష్ణ, తుంగభద్ర ఎడమ కాలువ, బీమా వంటి ప్రాజెక్టులను రద్దు చేయవద్దని, కొనసాగించాలని స్పష్టంచేసింది. అయినా నాడు ఆ ప్రాజెక్టులను రద్దుచేసి పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా(Palamuru district as a migration district) మార్చింది కాంగ్రెస్‌. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్‌ పార్టీ. హైదరాబాద్‌ సొంత రాష్ట్రంగా ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధలు, పాలమూరు వలసల బాధలు తప్పేవి’ అని అన్నారు.

BRS | Harish Rao | అసెంబ్లీలో ఉత్త‌మ్ క‌ట్టుక‌థ‌లు

Harish Rao

శాసనసభలో నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కట్టుకథలు చెప్పార‌ హరీశ్‌రావు మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గత రెండు రోజులు(The Congress government has been in power for the last two days) శాసనసభను నడిపిన తీరు, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తూ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పిన అబ‌ద్దాల‌ను హరీశ్‌రావు ఎండగట్టారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తూ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పిన అబ‌ద్దాల‌ని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ఏవిధంగా అబద్ధపు ప్రచారాలు(False propaganda) చేస్తున్నద‌ని వివరించారు.

BRS | Harish Rao | ద్రోహాల‌ను.. వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకుని..

Harish Rao


నిన్న శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీ తన ద్రోహాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) కట్టుకథలను, రేవంత్ రెడ్డి పిట్ట కథలను చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా అబద్ధాలు చెప్పారు. తెలంగాణకు బీఆర్‌ఎస్‌ ఏదో అన్యాయం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను(Telangana state interests) ఫణంగా పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించి ఇచ్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీది’ అని హ‌రీశ్‌రావు చెప్పారు.

CLICK HERE TO READ నిబంధనలన్నీ నిండు ప్రాణాలు కాపాడేందుకే

CLICK HERE TO READ MORE

Leave a Reply