పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా నుంచి ఓ మేజర్ అప్డేట్ విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ట్రైలర్ రిలీజ్ డేట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్.
ఇటీవలే ఈ సినిమాను జూలై 24న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు ట్రైలర్‌ను జూలై 3న ఉదయం 11:10 గంటలకు విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో భారీగా ఉత్సాహం నెలకొంది.
ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణలు దర్శకత్వం వహిస్తుండగా, ఎ.ఎం.రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
కీలక పాత్రల్లో బాబీ డియోల్, నిధి అగర్వాల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి లాంటి నటులు నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక ట్రైలర్ విడుదలకు ఇంకొంతే సమయం ఉండటంతో, అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.