బాలిక ఆత్మ‌హ‌త్య‌..

కోరుట్ల టౌన్, ఆంధ్రప్రభ : ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కోరుట్లకు చెందిన మదినం నందీశ్వర్ అనే వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని వెంబడించి వేధించడమే కాకుండా, బెదిరింపులు కూడా చేసినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు.

ఈ ఘటనపై స్పందించిన కోరుట్ల ఎస్‌ఐ చిరంజీవి మాట్లాడుతూ… బాలిక ఆత్మహత్యకు కారణమైన నందీశ్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

Leave a Reply