చెరువును తలపిస్తున్న హనుమకొండ
హనమకొండ, ఆంధ్రప్రభ : హనుమకొండ నగరం మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. తుఫాన్ ఎఫెక్ట్(Hurricane effect)తో కురిసిన కుండబోత వర్షంతో నగరం జీవనం అ తలాకుతలమైంది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి వడ్డేపల్లి చెరువు మత్తడి దూకుతుంది. గోపాల చెరువు నిండికుండల తయారై, చెరువు కింద ఉన్న కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
హనుమకొండ.. కాజీపేట(Kazipet) వంద అడుగుల ప్రధాన రహదారిపై మూడు అడుగుల ఎత్తులో వర్షపునీరు ప్రవహిస్తుండడంతో కార్లు, బైకులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హనుమకొండ నగరంలోని వివేక్ నగర్, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ(TV Tower Colony), కూడా కాలనీ, సమ్మయ్య నగర్, అశోక్ కాలనీ, రాంనగర్, నెహ్రు నగర్, కిషన్ పుర, సప్తగిరి కాలనీ, జహార్ కాలనీ, పోచమ్మ కుంట, జులై వాడ, సాయి కాలనీ, నాగేంద్ర నగర్, ప్రగతి నగర్, రామకృష్ణ కాలనీ లను వర్షపు నీరు చుట్టుముట్టింది.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy), హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి ఉప్పు ప్రాంతాలను సందర్శించారు. పునరాస కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నారు.




