Hanmakonda | కోర్టుకు బాంబు బెదిరింపు.. 6 డిటోనేట‌ర్లు ల‌భ్యం..

హైద‌రాబాద్ : హ‌నుమ‌కొండ కోర్టు (Hanmakonda Court) కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. బాంబు బెదిరింపుల దృష్ట్యా పోలీసులు అప్ర‌మ‌త్తమ‌య్యారు. కోర్టు ప్రాంగ‌ణంలో పోలీసులు క్షుణ్ణంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. బాంబు స్క్వాడ్ (Bomb squad), డాగ్ స్క్వాడ్ (Dog Squad) తో త‌నిఖీలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆరు డిటోనేట‌ర్లు ల‌భ్య‌మ‌య్యాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయ‌వాదులు, లాయ‌ర్లు, సిబ్బంది తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కోర్టులో బాంబు పెట్టిన‌ట్లు డ‌య‌ల్ 100కు గుర్తు తెలియ‌ని దుండ‌గుడు ఫోన్ చేసి చెప్పాడు.

Leave a Reply